![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమయ్యే సీరియల్స్ లలో బ్రహ్మముడి సీరియల్ కి ఉండే క్రేజే వేరు. అందులో కావ్య పాత్ర అందరికి సుపరిచితమే. అయితే కావ్య అసలు పేరు దీపిక రంగరాజు. తను బ్రహ్మముడి సీరియల్ లో తెలుగు సంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనంగా నటిస్తుంది.
తాజాగా కావ్య తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. మై డియర్ ఫ్రెండ్స్.. బిగ్ సర్‌ప్రైజ్ రాబోతుంది.. హింట్ ఆల్‌రెడీ ఇచ్చాను.. గెస్ చేయండి చూద్దామంటూ కావ్య పోస్ట్ పెట్టింది. అయితే ఇది ఏమై ఉంటుందా అని కావ్య ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు. అయితే కావ్య పెట్టిన పోస్ట్‌లో 'బిగ్' అనే పదాన్ని హైలెట్ చేసింది. అలానే ఆ క్యాప్షన్ చివరిలో కన్ను సింబల్ పెట్టింది. దీంతో తను బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లబోతున్నానంటూ చెప్పకనే చెప్పిందన్నమాట.
నిన్నటి ఎపిసోడ్ లో ప్రభాకర్-ఆమని, అర్జున్ కళ్యాణ్-అనుమతి హౌస్‌లోకి వచ్చి టాప్-5కి టాస్కుల్లో గట్టి పోటీ ఇచ్చారు. ఈ రోజు ఎపిసోడ్‌లోనే బ్రహ్మముడి కావ్య.. అదేనండి దీపిక రంగరాజు కూడా హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతుందన్నమాట. సెలబ్రెటీ ఎంట్రీలో భాగంగా దీపిక హౌస్‌లోకి వచ్చి ఫైనలిస్టులతో ఓ ఆట ఆడబోతుంది. మాములుగానే దీపిక యమ ఫాస్ట్. ఇలా బిగ్ బాస్ హౌస్ లో గేమ్స్ అంటే ఏ రేంజ్ లో ఆడుతుందో ఊహకి కూడా అందదు. స్టార్ మా పరివార్ షోలో దీపిక పంచులు ఇప్పటికి ఇన్ స్టాగ్రామ్ లో ట్రెండింగ్ లో ఉంటాయి. ఇక బిగ్ బాస్ హౌస్ లో ఈ బ్రహ్మముడి కావ్య ఏ రేంజ్ లో ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తుందో చూడాలి మరి.
![]() |
![]() |